హైదరాబాద్‌ః రాష్ట్రంలో గుట్కాను నిషేధించారు. మంగళవారం నుంచి నిషేధాన్ని అముల్లోకి తెస్తూ బుధవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో సుమారు 400 కోట్ల రూపాయల టర్నోవర్‌తో గుట్కా వ్యాపారం సాగుతున్నది.
గుట్కాలో కూడా కల్తీ గుట్కా అమ్మకాలు జోరుగా వుండటంతో తీవ్రమైనఅరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. దీనిపై సామాజిక కార్యకర్తలు గత కొద్ది రోజులుగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నవిషయం విదితమే. నోటి కాన్సర్ రోగుల్లో 40 శాతం మంది కేవలం గుట్కా కారణంగానే కాన్సర్ వాతపడుతున్నారు. దేశంలో మొదటిసారిగా తమిళనాడు ప్రభుత్వం నెల రోజుల కిందట పాన్ మసాలాలపై నిషేధం విధించింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా అదే జాబితాలో చేరింది.