నేపాల్‌లో 48 మంది మావోయిస్టుల హతం
ఖాట్మండు: భద్రతా బలగాలతో జరిగిన ఘర్షణల్లో నేపాల్‌లో 48 మంది మావోయిస్టు తిరుగుబాటు దారులు హతమయ్యారు. తిరుగుబాటును అణచివేయడానికి మూడు నెలల క్రితం విధించిన అత్యవసర పరిస్థితిని పొడిగిస్తూ పార్లమెంటు గురువారం ఓటు చేయనున్న నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది.
ఇంకా ఎక్కువ మందే చనిపోయి వుంటారని, కొన్ని మృతదేహాలను తిరుగుబాటుదారులు తీసికెళ్లారని,అందువల్ల మృతుల సంఖ్య కచ్చితంగా తెలియదని అన్నారు.
సంఘటనా స్థలాల నుంచి ఆయుధాలను, మందుగుండు సామగ్రిని, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలుస్వాధీనం చేసుకున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.












Click it and Unblock the Notifications