మతం కార్డు ఎన్నడూ వాడలేదు: పిఎం
న్యూఢిల్లీ: ఎన్నికల్లోవిజయం సాధించడానికి తాను మతం కార్డును ఎప్పుడూ వాడలేదని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి స్పష్టం చేశారు. ముస్లిం ఓట్లవిషయంలో తాను చేసిన ప్రకటనను ప్రతిపక్షాలు దుయ్యబట్టడుతుండడంపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. తన ప్రకటన పూర్తి పాఠాన్ని పరిశీలించకుండా ప్రతిపక్షాలువిమర్శలు చేస్తున్నాయని ఆయన గురువారం అన్నారు. ప్రతిపక్షాలవిమర్శలను ఖండిస్తూ ఆయన రెండు పేజీల ప్రకటన విడుదల చేశారు.












Click it and Unblock the Notifications