లక్నో: ఉత్తరప్రదేశ్ శాసనసభకు తుది విడత గురువారం జరిగిన పోలింగ్‌లో 55 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడవ విడత ఉత్తరప్రదేశ్‌లోని 166 స్థానాలకు పోలింగ్ జరిగింది.
చెదురు మొదురు సంఘటనలుమినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ప్రతాప్‌ఘర్, వారణాసిలలో ఇద్దరు వ్యక్తులకు కాల్పుల్లో గాయాలయ్యాయి. భదోహి,మీర్జాపూర్ జిల్లాల్లో కాల్పులు జరిగినట్లు సమాచారం. పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేర చరిత్ర గల అభ్యర్థులు రంగంలో వున్న చోట్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.