భారత్ లక్ష్యం 121 - స్కోర్ 35/3
న్యూఢిల్లీః న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కొట్లా మైదానంలో జింబాంబ్వేతో జరుగుతున్న రెండోటెస్ట్ లో స్పిన్నర్లు విజృంభించడంతో భారత్‌విజయదిశగా పయనిస్తున్నది. హర్భజన్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఆరువికెట్లు, కుంబ్లే నాలుగు వికెట్లు తీసుకోవడంతో జింబాంబ్వే రెండో ఇన్నింగ్స్ 146 పరుగులకే ముగిసింది. దీంతో జింబాంబ్వేకు 121 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంకా ఒకరోజు ఆటమిగిలి వుండడంతో ఈ తక్కువ లక్ష్యం సాధించడం భారత్ కు అసాధ్యం కాదు.
దీంతో రెండో టెస్టు రసపట్టులో పడుంది. 86 పరుగుల లక్ష్యంతో భారత్ సోమవారం బరిలోకి దిగితుంది. సచిన్, దాస్ క్రీజ్ లో వున్నారు.సెహవాగ్ భుజానికి గాయం కావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు.సెహవాగ్ కూడా లేకుండా స్పిన్ బాగా తిరుగుతున్న పిచ్ లో భారత్‌విజయం సాధిస్తుందో లేక చతికిల పడుతుందో వేచి చూడాలి. మళ్ళీ భారమంతా సచిన్‌పైనే వుంది.












Click it and Unblock the Notifications
