• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పోటో బిల్లు ప్రవేశపెట్టిన అద్వానీ

By Staff
|

న్యూఢిల్లీ: ఉగ్రవాద నిరోధక బిల్లు(పొటో)ను పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో తెలుగుదేశం పార్టీ సమర్థించింది. పొటోను సమర్థిస్తూ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతకె. ఎర్రంనాయుడు సమావేశంలో ప్రసంగించారు.

తీవ్రవాదం జమ్మూ కాశ్మీర్‌కు మాత్రమే పరిమితం కాలేదని, భారతదేశమంతావిస్తరించిందని ఆయన అన్నారు. పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఇంటర్‌సర్వీస్‌ ఇంటలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) కార్యకలాపాలు కూడా విస్తరించాయని ఆయన అన్నారు.

జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీపై, పార్లమెంటుపై దాడులు, ముంబాయిలో, హైదరాబాద్‌ల్లో బాంబుపేలుళ్లు తీవ్రవాద చర్యలేనని ఆయన అన్నారు. ఈ తీవ్రవాదాన్ని నిరోధించడానికి ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవని ఆయన అన్నారు. గత ఐదేళ్ల నుంచి టాడాను ప్రయోగించడం లేదని ఆయన చెప్పారు. ఈ స్థితిలో ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పొటో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X