మురసు తుఫాను దెబ్బకు 1,302 కిలోమీటర్ల రోడ్లు ధ్వంసం.. పునరుద్ధరణకు ఎన్ని వందల కోట్లంటే!

తీవ్ర తుఫాను 'మురసు' ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని రహదారుల నెట్‌వర్క్ తీవ్రంగా దెబ్బతింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,302 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమైనట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి వెల్లడించారు. క్షేత్రస్థాయి నుంచి అందిన నివేదికల ఆధారంగా ప్రాథమిక నష్టాన్ని అంచనా వేసినట్లు ఆయన పేర్కొన్నారు.

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన, రైతులకు కీలక హామీ..!!
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన, రైతులకు కీలక హామీ..!!

తుఫాను ప్రభావం ముఖ్యంగా 10 జిల్లాలపై తీవ్రంగా పడింది. అత్యధికంగా తీరప్రాంత జిల్లాల్లోని రహదారులు నీటమునిగాయి. బాపట్ల జిల్లాలో 332 కి.మీ, గుంటూరు జిల్లాలో 266 కి.మీ, ఎన్టీఆర్ జిల్లాలో 202 కి.మీ, పశ్చిమగోదావరి జిల్లాలో 122 కి.మీ, పల్నాడు జిల్లా: 93 కి.మీ, ఏలూరు జిల్లా: 75 కి.మీ, తూర్పుగోదావరి జిల్లాలో 68 కి.మీ,నెల్లూరు జిల్లాలో 66 కి.మీ, కృష్ణా జిల్లాలో 59 కి.మీ, ప్రకాశం జిల్లాలో 17 కి.మీ రహదారులు పాడయ్యాయన్నారు.

Murasu Cyclone Havoc 1302 km of R amp amp B Roads Damaged in AP Rs 870 90 Crore Needed for Restoration says R amp amp B Minister

ప్రజారవాణాకు అంతరాయం కలగకుండా అధికార యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోందని మంత్రి తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా 158 ప్రాంతాల్లో రహదారులు కోతకు గురికాగా, ఇప్పటికే 141 చోట్ల రాకపోకలను పునరుద్ధరించారు. వరద ఉధృతికి 31 ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోగా, 30 చోట్ల తాత్కాలిక మరమ్మతులు పూర్తిచేశారు. 60 ప్రాంతాల్లో కల్వర్టులు, డ్రైనేజీ నిర్మాణాలు దెబ్బతినగా, 58 చోట్ల మరమ్మతులు పూర్తయ్యాయని పేర్కొన్నారు.

 ఏపీకి మరో తుఫాను ముప్పు, ఈ జిల్లాల పై ప్రభావం- తాజా అంచనాలు..!!
ఏపీకి మరో తుఫాను ముప్పు, ఈ జిల్లాల పై ప్రభావం- తాజా అంచనాలు..!!

ఈదురు గాలుల తాకిడికి 207 చోట్ల భారీ వృక్షాలు రహదారులపై కూలిపోగా, రెస్క్యూ బృందాలు వాటన్నింటినీ పూర్తిగా తొలగించి మార్గాన్ని సుగమం చేశాయన్నారు.ట్రాఫిక్ స్తంభించిన 120 ప్రాంతాల్లో ఇప్పటికే 116 చోట్ల రద్దీని క్లియర్ చేశారన్నారు. అయితే వరద తీవ్రత అధికంగా ఉన్న తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని నాలుగు ప్రాంతాల్లో మాత్రం రాకపోకలకు ఇంకా ఇబ్బందులు కొనసాగుతున్నాయని, నీటిమట్టం తగ్గగానే అక్కడ కూడా పనులు పూర్తి చేస్తామని తెలిపారు.

దెబ్బతిన్న రోడ్లను సాధారణ స్థితికి తీసుకురావడానికి పెద్ద ఎత్తున నిధులు అవసరమవుతాయని ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. తాత్కాలిక మరమ్మతులకు రూ. 98.70 కోట్లు. శాశ్వత ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం చేయటానికి రూ. 772.22 కోట్లు అవసరం అని అంచనా వేసినట్టు తెలిపారు.ప్రాథమిక అంచనా సుమారు రూ. 870.90 కోట్లు అన్నారు.

వరద ముంపు ఇంకా తగ్గని ప్రాంతాల్లో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడకుండా ప్రమాద హెచ్చరిక బోర్డులు, బారికేడ్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.పూర్తిస్థాయి సమగ్ర నష్ట నివేదికను రూపొందించి కేంద్ర ప్రభుత్వ సహాయం కోసం నివేదిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+