హైదరాబాద్ తో పని లేకుండా జిల్లాల్లోనే మెరుగైన వైద్యం.. మంత్రి శుభవార్త!

హైదరాబాద్‌లోని సచివాలయంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ పునర్వ్యవస్థీకరణపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి జిల్లాలో డీసీహెచ్‌ఎస్ కార్యాలయాల ఏర్పాటు, సెకండరీ హెల్త్ కేర్ వ్యవస్థ బలోపేతం అంశాలపై ఆయన వివరంగా సమీక్షించారు.జిల్లాల్లోనే అన్ని రకాల వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు కూడా ప్రజలు హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పరిస్థితి తగ్గాలని ఆయన అన్నారు. దీనికోసం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్రవ్యాప్తంగా 1,616 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించినట్లు మంత్రి తెలిపారు. అవసరమైన నర్సులు, టెక్నీషియన్ల నియామకాలు కూడా చేపట్టినట్లు వివరించారు.

Telangana specialist doctors Better Healthcare in Districts Telangana Appoints 1 616 Specialist Doctors said health Minister

30 పడకలు, 50 పడకలు, 100 పడకల ఆసుపత్రులకు వేర్వేరు వైద్య సేవల ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రతి ఆసుపత్రిలో స్పెషలిస్ట్ వైద్య సేవలు, ఆధునిక పరికరాలు, డయాగ్నస్టిక్ సదుపాయాలు కల్పించాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఐపీహెచ్‌ఎస్ ప్రమాణాలకు అనుగుణంగా ఆసుపత్రులను అభివృద్ధి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ఆసుపత్రుల పనితీరు, వైద్య సేవల నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ అవసరమని చెప్పారు.

గత కొన్నేళ్లలో ఆరోగ్యశాఖలో వేలాది ఉద్యోగాలు భర్తీ చేయడం, కొత్త ఆసుపత్రి భవనాల నిర్మాణం, పరికరాల సమకూర్పు ద్వారా సెకండరీ హెల్త్ కేర్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రజలు తమ జిల్లాల్లోనే నాణ్యమైన వైద్య సేవలు పొందాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. దీని వల్ల రోగులు దూర ప్రాంతాలకు ప్రయాణించాల్సిన అవసరం తగ్గుతుంది. సమయం, డబ్బు ఆదా అవుతాయి.

భాగ్యలక్ష్మి ఆలయంలో నాణేల పంపిణీ..పోటెత్తిన భక్తులు; ఈ పంపిణీ వెనుక!
భాగ్యలక్ష్మి ఆలయంలో నాణేల పంపిణీ..పోటెత్తిన భక్తులు; ఈ పంపిణీ వెనుక!

అధికారులు ఈ దిశగా వేగంగా చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు.తెలంగాణలో గ్రామీణ, జిల్లా స్థాయి ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా ప్రజల ఆరోగ్య భద్రత పెరుగుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. స్పెషలిస్ట్ వైద్యులు, ఆధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో జిల్లా ఆసుపత్రులు పూర్తి స్థాయి వైద్య కేంద్రాలుగా మారనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+