కేసీఆర్ బిగ్ స్కెచ్ - హరీష్, కేటీఆర్ కు కొత్త బాధ్యతలు..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్ల కాలం పూర్తి అవుతోంది. దీంతో... వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు కొత్త వ్యూహాలతో సిద్దం అవుతున్నాయి. తిరిగి అధికారం నిలబెట్టుకోవటమే లక్ష్యంగా రేవంత్ నిర్ణయాల దిశగా కసరత్తు చేస్తున్నారు. తామే అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్, బీజేపీ ధీమా వ్యక్తం చేస్తు న్నాయి. ఇదే సమయంలో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ కీలక మంత్రాంగం నిర్వహిస్తున్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
తెలంగాణలో ఎన్నికల రాజకీయం మొదలు అవుతోంది. రేవంత్ ప్రభుత్వం మాడేళ్లు పూర్తి చేసుకో వటంతో.. మిగిలిన రెండేళ్ల కాలంలో ఓటర్లను ఆకట్టుకునే నిర్ణయాల పైన కసరత్తు చేస్తున్నారు. పెండింగ్ లో ఉన్న హామీల అమలు పైన వరుసగా సమీక్షలు కొనసాగుతున్నాయి. రాజకీయంగా నూ పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలతో సిద్దం అవుతున్నారు. మంత్రివర్గంలోనూ త్వరలో మార్పులు ఉంటాయని చెబుతున్నారు. డిసెంబర్ లో రాజకీయంగా కీలక నిర్ణయాలు ఉంటాయని పార్టీ ముఖ్య నేతల సమాచారం. అటు బీజేపీ ప్రధాన నాయకత్వం తెలంగాణ పైన ఫోకస్ చేసింది. ప్రధాని సహా పలువురు కీలక నేతలు తెలంగాణలో పర్యటనలకు సిద్దం అయ్యారు. అమిత్ షా సైతం హైదరాబాద్ పర్యటనలో పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేసారు.

పూర్తి స్థాయిలో వికేంద్రీకరణ పై కసరత్తు
ఈ సమయంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త వ్యూహాలతో సిద్దం అవుతున్నారు. మూడేళ్ల కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పైన ప్రజల్లో ఆగ్రహం ఉందని పార్టీ ముఖ్య నేతల సమావేశం లో కేసీఆర్ చెబుతూ వచ్చారు. పార్టీ పరంగా రాజకీయ కార్యాచరణలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఈ సమయంలోనే పార్టీలోని కింది స్థాయిలో పార్టీ వాయిస్ బలంగా వినిపించే వారిని గుర్తించి.. వారిని ప్రోత్సహించాలని డిసైడ్ అయ్యారు. ఇందు కోసం కేటీఆర్, హరీష్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రతీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే.. ఇంఛార్జ్ లు స్థానిక సమస్యల పైన పూర్తి స్థాయిలో ప్రజలతో మమేకం అయ్యేలా చూడాల్సిన బాధ్యత ఈ ఇద్దరికి కేటాయించారు. అదే విధంగా రాష్ట్ర స్థాయిలో ప్రజా సమస్యల పైన ధర్నాలు.. నిరసనల నిర్వహణ దిశగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. పార్టీ కేడర్‌లో స్తబ్ధతను పోగొట్టి, తిరిగి పోరాట పంథాను రగిలించడమే లక్ష్యంగా కేసీఆర్ తాజా వ్యూహాలు ఎంత వరకు ఫలిస్తాయనేది ఆసక్తిగా మారుతోంది.













Click it and Unblock the Notifications
