అవకాశాల కల్పనలో ఏపీ భేష్- ఈక్వాలిటీ ఇండెక్స్ లో రెండో ర్యాంక్ పై చంద్రబాబు..!

విభజన తర్వాత ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) .. అవకాశాల కల్పనలో మాత్రం దూసుకుపోతోంది. తమ పౌరులకు సామాజిక, ఆర్ధిక భద్రత కల్పించడంలో ఏపీ రెండో ర్యాంక్ లో నిలిచింది. ఈ మేరకు ఈక్వాలిటీ ఇండెక్స్ ర్యాంకుల్లో రెండో స్ధానం దక్కించుకుంది. తలసరి ఆదాయంలో 13వ స్ధానంలో ఉన్నా.. అవకాశాల కల్పనలో రాష్ట్రం రెండో స్ధానంలో ఉండటంపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా వెలువడిన సెంటర్ ఫర్ న్యూ ఎకనామిక్ స్టడీస్ నివేదికను ఆయన ప్రస్తావించారు.

టీడీపీ జడ్పీ ఛైర్మన్ కాబోతున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే..! మధ్యలో జనసేన ట్విస్ట్ ..!
టీడీపీ జడ్పీ ఛైర్మన్ కాబోతున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే..! మధ్యలో జనసేన ట్విస్ట్ ..!

ప్రజలకు అందుబాటులో ఉన్న అవకాశాలు, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, సామాజిక భద్రత వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. ఓపీ.జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ న్యూ ఎకనామిక్స్ స్టడీస్ (CNES) విడుదల చేసిన యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ AEI-2026పై సీఎం చంద్రబాబు స్పందించారు. గత రెండున్నరేళ్ల కాలంలో తమ పరిపాలనకు అద్దం పట్టేలా ఈ నివేదిక ఉందన్నారు. ఈ సూచీ రాష్ట్రాల ఆర్థిక సంపదతో పాటు ప్రజలకు దక్కుతున్న సమాన అవకాశాలు, పౌరులకు అవసరమైన సేవలు అందించేందుకు ఆ సంపదను ప్రభుత్వాలు ఎంత సమర్థంగా వినియోగిస్తున్నాయన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకుని రూపోందించిందని వెల్లడించారు.

Andhra Pradesh Emerges as Front Runner in Social and Economic Security Says CM Chandrababu

ఈక్వాలిటీ ఇండెక్స్ లో గోవా 0.68 స్కోరుతో మొదటి స్థానంలో నిలవగా.. ఆంధ్రప్రదేశ్ 0.66 స్కోరుతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. సిక్కిం 0.63, కేరళ 0.60, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు 0.57 స్కోరుతో ఏపీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ సూచీ ఆధారంగా సెంటర్ ఫర్ న్యూ ఎకనామిక్స్ స్టడీస్ ఆంధ్రప్రదేశ్‌ను ఫ్రంట్ రన్నర్ రాష్ట్రంగా గుర్తించింది. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఏపీ అత్యధిక ర్యాంకు సాధించడం విశేషం. ఐదు ప్రధాన అంశాల ఆధారంగా ఈ సూచీని రూపొందించారు. ప్రాథమిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, సామాజిక-ఆర్థిక భద్రత, న్యాయ సేవలు వంటి అంశాలను ఇందులో పరిశీలించారు. మొత్తం 23 విభాగాల్లోని 60 సూచికలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ ఐదు అంశాల్లో సామాజిక, ఆర్థిక భద్రత విభాగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానాన్ని సాధించింది. ఈ విభాగంలో ఏపీ 0.69 స్కోరు సాధించగా, రెండో స్థానంలో ఉన్న గోవా 0.50 స్కోరుకే పరిమితమైంది. మిగిలిన నాలుగు విభాగాల్లోనూ దేశంలో అగ్రరాష్ట్రాల జాబితాలో ఏపీ నిలిచింది.

Andhra Pradesh Emerges as Front Runner in Social and Economic Security Says CM Chandrababu
ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..! CPS నుంచి OPSకి మారేందుకు మార్గదర్శకాలు..!
ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..! CPS నుంచి OPSకి మారేందుకు మార్గదర్శకాలు..!

తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 13వ స్థానంలో ఉన్నప్పటికీ, ప్రజలకు అవకాశాలు కల్పించడంలో మాత్రం రెండో స్థానంలో నిలవటం ఈ నివేదికలో ఆసక్తికరమైన అంశం. రాష్ట్ర ఆర్థిక స్థాయిని బట్టి అంచనా వేసిన యాక్సెస్ స్కోరు 0.51 కాగా, వాస్తవంగా సాధించిన స్కోరు 0.66 గా నమోదైంది. అంటే రాష్ట్ర ఆదాయ స్థాయితో పోలిస్తే అంచనాలకు మించి 0.15 పాయింట్లు అధిక స్కోరు ఏపీ సాధించింది. ఆదాయానికి, అవకాశాల కల్పనకు మధ్య ఉన్న ఈ సానుకూల వ్యత్యాసం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే అత్యధికంగా నమోదైంది. సంపద సృష్టి కోసం పెట్టుబడులు తీసుకురావటంతో పాటు ప్రజలకు మెరుగైన పాలన అందించటం అవకాశాలను అన్ లాక్ చేయటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందించటం వల్లే కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచారని పేర్కొన్నారు. యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ 2026లో దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో ఏపీ రెండవ స్థానంలో నిలవటం గర్వకారణమని సీఎం వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+