పరివార్ సంబంధాలు మనకెందుకు?
న్యూఢిల్లీ: సంఘ్ పరివార్‌తో గల సంబంధాలపై భారతీయ జనతా పార్టీ (బిజెపి)ని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) భాగస్వామ్య పార్టీలు నియంత్రించలేవని రక్షణ మంత్రి, ఎన్‌డిఎ కన్వీనర్ జార్జి ఫెర్నాండెజ్ అన్నారు. సంఘ్ పరివార్ వైఖరిని ఆయన దాదాపుగా సమర్థించారు.
సంఘ్ పరివార్‌తో బిజెపికి సంబంధాలుండడం అనేది కొత్తవిషయమేమీ కాదని ఆయన అన్నారు. అయోధ్య వివాదం చాలా సంక్లిష్టమైందని, ఇది సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కావడానికి మనందరం తలా ఓ చేయి వేయాల్సిన అవసరం ఉన్నదని ఫెర్నాండెజ్ అన్నారు.












Click it and Unblock the Notifications
