కుటుంబ సభ్యులతో నైనీటాల్‌లో ప్రధాని
నైనీటాల్: భారీ భద్రత మధ్య మూడు రోజుల అనధికార పర్యటన నిమిత్తం ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి గురువారం నైనీటాల్‌కు చేరుకున్నారు.
బరేలీ నుంచి ప్రధాని తన దత్త పుత్రిక నమిత, అల్లుడు రంజన్ భట్టాచార్య, మనవరాలు నిహారికలతో హెలికాప్టర్‌లో నైనిటాల్ చేరుకున్నారు.
నైనీటాల్‌లో ఆయన రాజభవన్‌లో వుంటారు. ఆయనకు గవర్నర్ ఎస్‌ఎస్ బర్నాల సాదరస్వాగతం చెప్పారు. ప్రధానిది పూర్తి అనధికార పర్యటన అని ప్రధాని కార్యాలయ అధికారి చెప్పారు.












Click it and Unblock the Notifications