మోడిని తప్పించం: జనా కృష్ణమూర్తి
రాంచీ: గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుంచి నరేంద్ర మోడిని తప్పించే ప్రసక్తే లేదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు జనా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. మోడిని పదవి నుంచి తప్పించాలనే ప్రతిపక్షాల, కొన్ని బిజెపి మిత్రపక్షాల డిమాండ్‌ను ఆయన సోమవారంవిలేకరుల సమావేశంలో విమర్శించారు.
మోడిని తప్పించాలనే సమతా పార్టీ అధికార ప్రతినిధి శంభు శ్రీవాస్తవ డిమాండ్ గురించివిలేకరులు ప్రస్తావించగా పార్టీ నుంచి తనకు అటువంటి డిమాండ్ ఏదీఅందలేదని ఆయన చెప్పారు. వచ్చే ఎన్‌డిఎ సమన్వయ కమిటీ సమావేశంలో ఈవిషయమై
సమతా పార్టీ సీనియర్ నేత జార్జి ఫెర్నాండెజ్ నుంచివివరణ కోరుతానని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో మత విద్వేషాలను అదుపు చేయడానికి నరేంద్ర మోడీ చేయాల్సిందంతా చేశారని, గోద్రా ఊచకోత ఫలితంగా చెలరేగిన హత్య కాండకు నరేంద్ర మోడిని ఎందుకు బాధ్యుడ్ని చేస్తున్నారో తనకుఅర్థం కావడం లేదని ఆయన అన్నారు.
గుజరాత్‌లో హత్యాకాండను తమ పార్టీ సమర్థించడం లేదని, రాష్ట్రంలో కొనసాగుతున్న మత విధ్వంసానికి మోడిని బాధ్యుడ్ని చేయడం లేదని ఆయన చెప్పారు. ఉగ్రవాద నిరోధక చట్టాన్ని తెచ్చిన నేపథ్యంలో పాకిస్థాన్ పన్నిన కుట్రలో భాగంగానే గుజరాత్‌లో మత హింస జరుగుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
