చెెన్నైలో బ్యాంకు దోపిడీ యత్నం,హత్య

చెన్నైః చెన్నై లో బుధవారం నాడు కొందరు సాయుధులు బ్యాంకు దోపిడీకి విఫలయత్నం చేశారు. అడయారులోని బెసెంట్‌నగర్‌ ఎస్‌బిఐ శాఖలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో నగదు అపహరణ జరక్కపోయినా బ్యాంకు సీనియర్‌ ఉద్యోగి ఒకరు మాత్రం దుండగులు దాడిలో మరణించారు.

మరి కొందరు ఉద్యోగులు కూడా ఈ సంఘటనలో గాయపడ్డారు. ఉదయం బ్యాంకు తెరిసిన వెంటనే ఆరుగురు వ్యక్తులు ఉద్యోగులతో పాటు బ్యాంకులోకి చొరబడ్డారని తెలిసింది. లోపలికి ప్రవేశించిన వెంటనే గార్డును లొంగదీసుకుని కత్తులు, హాండ్‌ గ్రేనెడ్లతో సిబ్బందిని బెదరించారు. లాకర్‌ తాళాలు ఇవ్వడానికి నిరాకరించిన మానేజర్‌విశ్వనాథన్‌ను దుండగలు నిర్ధాక్షిణ్యంగా కత్తులతో పొడిచారు. ఆయన అక్కడికక్కడే మరణించారు. ఆ తర్వాత లాకర్‌ తెరవడానికి ప్రయత్నించగా అలారమ్‌ ఒక్కసారిగా మోగడంతో భయపడిపారిపోయారు. రాత్రి ఆన్‌లో వుంచిన అలారమ్‌ను సిబ్బందిఅప్పటికి ఆఫ్‌ చేయకపోవడం వల్ల అలారమ్‌ మోగిందని తెలిసింది. ఈ సంఘటన పోలీసు యంత్రాంగంలో తీవ్ర సంచలనం సృష్టించింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+