వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్ఫోసిస్‌కు 270 కోట్ల లాభం

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూరుః దేశంలోని అగ్రశ్రేణి సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ మార్చి 2002తో ముగిసిన మూడు నెలలకాలంలో 270 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ముందుగా ప్రకటించినట్టుగా 30 శాతం వృద్ధిరేటును సాధించినట్టుగా ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. రానున్న పన్నెండు నెలలకాలాన్ని మాత్రం కష్టకాలంగానే కంపెనీ అంచనావేస్తున్నది.

క్రితం సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్ధిక సంవత్సరం 37 శాతం అధికంగా 2603 కోట్ల రూపాయలు సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా ఆర్జించినట్టుగా ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. నాలుగో త్రైమాసికంలో ఆదాయం తాము ఊహించిన విధంగానే 680 కోట్ల రూపాయలు వున్నదనిఅందుకుముందు ఏడాది నాలుగో త్రైమాసికం కంటే ఇది 21 శాతం అధికమని కంపెనీ వెల్లడించింది. సంవత్సరం మొత్తంమ్మీద నిర్వహణ లాభం అంతకుముందు ఏడాది కంటే 35 శాతం అధికంగా 1037 కోట్ల రూపాయలు వుంది. క్రితం ఏడాది ఇన్ఫోసిస్‌కు మాత్రమే కాకుండా దేశంలోని అన్నిసాఫ్ట్‌వేర్‌ సంస్థలకు గడ్డుకాలమేనని ఇన్ఫోసిస్‌ మానేజింగ్‌ డైరెక్టర్‌ నందన్‌ నీలేకని వ్యాఖ్యానించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X