కార్తీక మాసం వేళ శ్రీశైలం భక్తులకు బిగ్ అప్డేట్ - దర్శనం, సేవల్లో కీలక మార్పులు..!!

శ్రీశైల మహాక్షేత్రంలో పవిత్ర కార్తిక మాసోత్సవాలకు దేవస్థానం సర్వం సిద్ధం అయింది. నవంబరు 10వ తేదీ నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు నెల రోజుల పాటు ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ పవిత్ర రోజుల్లో శ్రీశైలానికి విచ్చేసే లక్షలాది మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేసారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా కీలక మార్పులతో పలు నిర్ణయాలు అమలు చేస్తున్నారు.

కార్తీక మాసంలో శ్రీశైలంలో భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేసారు. ఈ మాసంలో అభిషేకం జరిపిం చుకోవాలని భావించే భక్తుల కోసం ప్రత్యేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా శ్రీశైలంలో చారిత్రక ప్రాధాన్యం ఉన్న పంచమఠాల్లో ఆర్జిత అభిషేకాలను ప్రవేశపెట్టినట్లు ప్రకటించారు. సామాన్య భక్తులు సైతం సులభంగా స్వామివారికి అభిషేకం చేసుకునేందుకు వీలుగా ఈ సేవా రుసుమును కేవలం రూ. 216గా నిర్ణయించారు. ఒక్క టికెట్‌పై దంపతులను గానీ లేదా ఒక వ్యక్తిని గానీ అభిషేకానికి అనుమతిస్తారు. భక్తులు తమ సౌకర్యం కోసం ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకునేందుకు డిజిటల్ విధానాలను అందుబాటులోకి తెచ్చారు. 'మనమిత్ర' వాట్సాప్‌ నంబర్ 9552300009 ద్వారా కానీ, ఏపీటీఎస్ వారి అధికారిక వెబ్‌సైట్ www.tms.ap.gov.in ద్వారా కానీ ఈ ఆర్జిత అభిషేక టికెట్లను సులభంగా పొందవచ్చు.

 భక్తులకు టీటీడీ అరుదైన అవకాశం - ఆన్ లైన్ సదుపాయం, నేరుగా ఇంటి వద్దకే..!!
భక్తులకు టీటీడీ అరుదైన అవకాశం - ఆన్ లైన్ సదుపాయం, నేరుగా ఇంటి వద్దకే..!!
srisailam-gears-up-for-grand-month-long-karthika-masam-celebrations-from-november-11-to-december-9th

కీలక మార్పులు

కార్తీక మాసంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నందున, సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా నవంబరు 10 నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు ఆలయ దర్శన వేళల్లో, సేవలలో పలు మార్పులు చేశారు. రద్దీ రోజుల్లో రూ.5,000ల గర్భాలయ అభిషేకాలు, రూ.1,500 ల సామూహిక అభిషేకాలను తాత్కాలికంగా రద్దు చేశారు. వీటితో పాటు ఉదయాస్తమాన సేవ, ప్రాతఃకాల సేవ, ప్రదోషకాల సేవల టికెట్లను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రద్దీ రోజుల్లో అమ్మవారి అంతరాలయంలో జరిగే రూ.1,000 కుంకుమార్చన సేవను, భక్తుల రద్దీ దృష్ట్యా 'ఆశీర్వచన మండపం' లో నిర్వహించేలా మార్పులు చేశారు. కాగా.. ఆలయంలో జరిగే ఆర్జిత హోమాలు, కల్యాణోత్సవ సేవలు మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా యథావిధిగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+