రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (ట్రినిడాడ్): సెంచరీలను సమం చేసినప్పటికీ తాను డాన్ బ్రాడ్‌మన్‌కు సరితూగనని భారత స్టార్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ అన్నారు. సచిన్ టెండూల్కర్ శుక్రవారం వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో 29వ సెంచరీ సాధించి బ్రాడ్‌మన్ రికార్డును సమం చేశారు.
బ్రాడ్‌మన్ రికార్డు చేయడం బాగానే అనిపించింది. కానీ ఆయనకు మరెవరూ సాటిరారు. ఈ విషయాన్ని ప్రపంచమంతా అంగీకరించింది అని టెండూల్కర్ అన్నారు. టెస్ట్ మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించిన వారి వరుసలో తన పేరుండడం మంచి భావననే కలిగిస్తుందని ఆయన అన్నారు.
సెంచరీల నమోదులో బ్రాడ్‌మన్, సచిన్ టెండూల్కర్‌ల కన్నా సునీల్ గవాస్కర్ అగ్రస్థానంలో ఉన్నారు. గవాస్కర్ 34 సెంచరీలు సాధించారు. ఆస్ట్రేలియాకు చెందిన బ్రాడ్‌మన్ 52 టెస్టుల్లో 29 సెంచరీలు సాధించారు. గవాస్కర్ 125 మ్యాచ్‌ల్లో, టెండూల్కర్ 93 టెస్టుల్లో సాధించారు.
ఇక్కడి క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో గవాస్కర్ నాలుగు టెస్టు సెంచరీలు సాధించగా టెండూల్కర్‌కు ఇదే మొదటి సెంచరీ. గవాస్కర్ గొప్ప క్రీడాకారుడు. ఈ మైదానంలో సెంచరీ సాధించినందుకు నాకు ఆనందంగా వుంది. 1997 పర్యటనలో నేను మూడు సెంచరీలు మిస్సయ్యాను. అది ఈసారి నా మనస్సులో వుండిపోయింది అని టెండూల్కర్ అన్నారు.
వెస్టిండీస్‌లో సెంచరీ సాధించాలని అన్ని వేళలా అనుకున్నాను. వెస్టిండీస్‌లో అద్భుతమైన క్రికెట్ వుంది. బ్యాట్స్‌మన్ ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆడి పరుగులు సాధించాలనుకుంటారు అని ఆయన అన్నారు.
రాహుల్ ద్రావిడ్ బాగా ఆడి మంచి స్కోర్ సాధించాడని ఆయన ప్రశంసించారు. భారత్ 38 పరుగులకే రెండువికెట్లు కోల్పోయిన తరుణంలో రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ నిలకడగా ఆడి మూడోవికెట్‌కు 124 పరుగులు జోడించారు. ఆటలో తాను ఆనందం అనుభవించినంత కాలం ఆడుతూనే వుంటానని, అది ఎంత కాలమనేది తాను చెప్పలేనని, సాధ్యమైనంత ఎక్కువ కాలంఆడాలనుకుంటున్నానని ఆయన అన్నారు. క్రికెట్‌లోకి ప్రవేశించినప్పుడు ఎంత దూరం పోవాలనేది ఏమీ అనుకోలేదని, క్రికెట్ ఆడి సంతోషించాలని అనుకున్నానని, తక్కువగా మాట్లాడి ఎక్కువ బ్యాటింగ్ చేయాలనేది తన అభిమతమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
