రాజీనామాకు ఒమర్ అబ్దుల్లా సంసిద్ధత
న్యూఢిల్లీ: విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ఒమర్ అబ్దుల్లా మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు.
తమ పార్టీ నిర్ణయాన్ని ఒమర్ అబ్దుల్లా, అలీల మొహమ్మద్ నాయక్‌లతో కూడిన ఇద్దరు సభ్యుల ప్రతినిధి బృందం ప్రధాని వాజ్‌పేయికి తెలియజేసింది. తమ నిర్ణయం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుందని భావిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఒమర్ అబ్దుల్లా ప్రధానితో చెప్పారు. గుజరాత్ వ్యవహారంపై తాము తటస్థంగా వుండాల్సిన అనివార్య పరిస్థితుల గురించి ఆ ఇద్దరు నాయకులు ప్రధానికివివరించారు. ఎన్‌డిఎ కన్వీనర్ జార్జి ఫెర్నాండెజ్‌ను, బిజెపి నాయకుడు జస్వంత్ సింగ్‌ను కూడావీరు కలిశారు.












Click it and Unblock the Notifications
