జన్మభూమి సంగతి తేలుద్దాం రండి
హైదరాబాద్‌ః చంద్రబాబు నాయుడు ఘనంగా చెప్పుకుంటున్న జన్మభూమి కార్యక్రమంలో జరుగుతున్న అవకతవకల గురించి తెలుసుకొనేందుకు పల్లెల్లో పర్యటిద్దామంటూ కాంగ్రెస్ పార్టీ సవాల్‌విసిరింది. సత్తా వుంటే కేవలం నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించేందుకు చంద్రబాబు సిద్ధం కావాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధికె. రోశయ్య సవాలు చేశారు. దారి ఖర్చులను కూడా మేమేపెట్టుకుంటాం.. ఆయన నాలుగు నియోజక వర్గాల్లో పర్యటిస్తే జన్మభూమి బండారం బయటపడుతుందని రోశయ్య అన్నారు.












Click it and Unblock the Notifications
