• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నవంబర్‌ నుంచిపేపర్‌ లెస్‌ పాలన

By Staff
|

హైదరాబాద్‌ః ఈ ఏడాది నవంబర్‌ లోగా రాష్ట్ర వ్యాప్తంగాపేపర్‌ లెస్‌ పాలన ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆయన బుధవారం జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలోకోరారు. ఆరు నెలల కిందటే పేపర్‌ లెస్‌ పాలన ప్రక్రియకు రాష్ట్రంలోశ్రీకారం చుట్టారు. అయితే అన్ని ప్రభుత్వ శాఖలను ఈ పరిధిలోకి తీసుకురావడం, అన్ని శాఖలను కంప్యూటీకరీంచడం వంటి పనుల్లో ఐ.టి. శాఖ నిమగ్నమైంది.

ఈ ప్రక్రియను వేగవంతం చేసి నవంబర్‌ లోగా అన్ని ప్రభుత్వ శాఖల్లోపేపర్‌ లెస్‌ లావాదేవీలు ప్రారంభించాలని ఈ సమీక్షా సమావేశంలో చంద్రబాబు నాయుడుకోరారు. ఈ ప్రక్రియలో భాగంగా అన్ని ప్రభుత్వ శాఖలను కంప్యూటీకరిస్తున్నామని, కనీసం 2000 మంది ఉద్యోగులకు కంప్యూటర్‌ లో శిక్షణ ఇవ్వాల్సి వున్నదని రాష్ట్ర ఐటి శాఖ కార్యదర్శి జె.సత్యనారాయణ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X