హైదరాబాద్: హైదరాబాద్‌లో నలుగురు నకిలీ నక్సలైట్లను నగరం నార్త్‌జోన్‌టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరు పీపుల్స్‌వార్ క్లాస్‌వార్‌పేరు మీద తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్నారని పోలీసులు చెప్పారు.
అరెస్టయిన నకిలీ నక్సలైట్ల నుంచి మూడు నాటు తుపాకులు,విప్లవ సాహిత్యం, ఇతర ఆయుధాలను పోలీసులుస్వాధీనం చేసుకున్నారు. వీరు కరపత్రాలు, వాల్ పోస్టర్లు ప్రచురిస్తూ ప్రజల నుంచిపెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు చెప్పారు.వీరిపై పలు కేసులు నమోదయినట్లు వారు తెలిపారు.