న్యూఢిల్లీ ః ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ బిజెపి నాయకుడు జి కిషన్‌రెడ్డిని పార్టీ యువజన విభాగం బిజెవైఎం జాతీయ అధ్యక్షునిగా నియమిస్తున్నట్టుగా వెంకయ్యనాయుడు చెప్పారు.
కిషన్‌రెడ్డి గతంలో బిజెవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అనేక ఏళ్లపాటు బిజెవైఎం ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షునిగా వున్నారు. పార్టీ అధ్యక్షపదవిని చేపట్టిన వెంటనే తన సన్నిహిత సహచరునికి వెంకయ్య ఇచ్చిన ప్రమోషన్‌గా దీనిని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.