ఎండిఎంకెనేత వైగో అరెస్టు
చెన్నైఃఎండిఎంకె నేత, పార్లమెంట్ సభ్యుడువైగోను తమిళనాడు పోలీసులు గురువారంనాడు పోటా కింద అరెస్టు చేశారు. అమెరికాపర్యటన నుంచి గురువారం నాడేతిరిగివచ్చిన వైగోను విమానాశ్రయంలోనేపోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళఉగ్రవాద సంస్థ ఎల్‌టిటిఇకి మద్దతుఇస్తున్న ఆరోపణపై తమిళనాడు ప్రభుత్వంఆయనపై పోటాను ప్రయోగించింది.అరెస్టుచేసిన వెంటనే ఆయన్ను మదురైసమీపంలోని తిరుమంగళంకు తరలించారు.అక్కడే మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు.పార్లమెంట్ సభ్యుడు, రిజిస్టరయిన రాజకీయపార్టీ అధినేతను పోటా కింద అరెస్టు చేయడందేశంలో ఇదే ప్రధమం. వైగో అరెస్టుకు నిరసనగాప్రదర్శనకు దిగిన ఎండిఎంకె కార్యకర్తలనుపోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.గురువారం సాయంత్రం వరకు మూడువేల మందినిఅరెస్టు చేసినట్టుగా తెలిసింది.












Click it and Unblock the Notifications