హైటెక్‌ సిఎం పుస్తకాలు చదవరా?

హైదరాబాద్‌ః చరిత్ర గురించి సమాజాన్ని గురించి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు పుస్తకాలు చదవాలని రాష్ట్రపతి పదవికి వామపక్షాల అభ్యర్ధిగా పోటీ చేస్తున్న 87 ఏళ్ల వృద్ధ నేత లక్ష్మీ సెహగల్‌ పెద్ద తరహాగా ఒక సలహా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె గురువారం నాడు హైదరాబాద్‌కు వచ్చారు.

విమానాశ్రయం నుంచి ఆమెను వామపక్ష కార్యకర్తలు స్కూటర్‌ ర్యాలీతో మఖ్దూం భవన్‌ వరకు తీసుకువెళ్లారు. ఆ తర్వాతవిలేకరుల సమావేశంలో మాట్లాడిన లక్ష్మీసెహగల్‌, చంద్రబాబుకు వ్యక్తి గతంగా తాను తెలియకపోవడం గురించి తానేమీ పట్టించుకోవడం లేదని అయితే నేతాజీ సారథ్యంలోని ఐఎన్‌ఎస్‌ కూడా తెలియకపోవడం ఆశ్చర్యంగా వున్నదని ఆమె చెప్పారు. చంద్రబాబును హైటెక్‌ సిఎంఅంటారని తాను విన్నానని పుస్తకాలు చదువకున్నా అనేక వైబ్‌సైట్లలో ఐఎన్‌ఎస్‌ చరిత్ర గురించి వున్నదని ఆమె తెలిపారు. ఓటమి ఖాయమని తెలిసినప్పటికీ తాను బిజెపి మతోన్మాద రాజకీయాలను ఎదుర్కోవడానికే పోటీలోకి దిగానని ఎన్నికల తర్వాత కూడా తన పోరాటం సాగుతుందని ఆమె చెప్పారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+