వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంకయ్య టీమ్‌విజయ లక్ష్యం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః భారతీయ జనతాపార్టీ కొత్త నేతగా బాధ్యతలుస్వీకరించిన వెంకయ్యనాయుడు 72 మందితో కొత్తకార్యవర్గాన్ని గురువారం నాడు ప్రకటించారు. ఈ టీమ్‌లో పలువురు సీనియర్‌ నేతలు వున్నారు. ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, మాజీ కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీని పార్టీ ప్రధానకార్యదర్శులుగా నియమించారు.

అయిదుగురు ప్రధాన కార్యదర్శులు, ఏడుగురు ఉపాధ్యక్షులు కొత్తటీమ్‌లో వున్నారు. పార్టీ అధికార ప్రతినిధిగా జైట్లీ వ్యవహరిస్తారని ఆయనకు సునిల్‌శాస్త్రి, నక్విసహకరిస్తారని బిజెపి అధ్యక్షునిగా బాధ్యతలుస్వీకరించిన తర్వాత తొలిసారిగా వెంకయ్య విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.టీమ్‌ వర్క్‌కే తాను ప్రాధాన్యత ఇస్తానని ఆయన చెప్పారు. ఇక నుంచి పార్టీ అధ్యక్షుడు కేంద్రంగా వ్యవహరించదని ఆయన చెప్పారు. సమావేశాలకు తాను అధ్యక్షత మాత్రమే వహిస్తానని కమిటీనే తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. ముఠాతత్వం, గ్రూపిజం, క్రమశిక్షణారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితిలోనూ సహించేది లేదని ఆయనవిస్పష్టంగా ప్రకటించారు. ఈ దుర్లక్షణాలు వుంటే పార్టీ భారీగా మూల్యం చెల్లించాల్సివస్తుందని ఆయన హెచ్చరించారు. రానున్నఅసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని అనుభవజ్ఞులను, ఉత్సాహవంతులైన యువనేతలను కలుపుకుని కొత్తటీమ్‌ను నిర్మించినట్టుగా ఆయన చెప్పారు.దేశంలో ఈ రోజు అటల్‌బిహారీ వాజ్‌పేయి అత్యున్నత స్థాయి నాయకుడని, యావత్‌ జాతికి, ఎన్‌డిఎకు, బిజెపికి, తనకు, అద్వానీకి కూడా ఆయనే నాయకుడని వెంకయ్య ప్రకటించారు. బిజెపిని కొత్త శక్తులతో నింపేందుకు పార్టీ బాధ్యతలను పూర్తిగా అద్వానీకిఅప్పగించాలని కొందరు సీనియర్‌ నేతలు వాజ్‌పేయిని కోరారని అయితే వాజ్‌పేయిఅందుకు నిర్ద్వంద్వంగా తిరస్కరించారని వెంకయ్య తెలిపారు. అద్వానీ లేకుండా ప్రభుత్వ నిర్వహణ సాధ్యం కాదని చెప్పారని వెంకయ్య వెల్లడించారు. బిజెపి యువజన విభాగం
భారతీయ జనతా యువమోర్చా కొత్త అధ్యక్షునిగా కిషన్‌రెడ్డిని నియమించారు. వచ్చే ఏడాదిఅసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఢిల్లీ నుంచి మాజీ ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ను, మహారాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి గోపినాథ్‌మూండేను పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించారు. కాగా మరో ఢిల్లీ నేత అనితా ఆర్యను ప్రధాన కార్యదర్శిగా నియమించారు. కోశాధికారిగా రామ్‌దాస్‌అగర్వాల్‌ను నియమించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X