వార్ బంద్ ప్రశాంతం
హైదరాబాద్: ఎన్‌కౌంటర్లకు నిరసనగాపీపుల్స్‌వార్ నక్సలైట్లు తలపెట్టిన బంద్ ప్రశాంతంగా జరుగుతోంది.పీపుల్స్‌వార్ తలపెట్టిన రెండు రోజుల బంద్ గురువారం ప్రారంభమైంది. బంద్‌కు ముందు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఎన్‌కౌంటర్లు, ప్రభుత్వ కార్యాలయాల విధ్వంసం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో అవాంఛనీయ సంఘటనలేవీ జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వరంగల్ జిల్లాలో కూడా బంద్ ప్రభావం పాక్షికంగానే ఉంది. ఆర్టీసి బస్సులు నడిచాయి. నక్సల్స్ ప్రభావం అధికంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో మారుమూల గ్రామాలకు బస్సులను నడపలేదు.












Click it and Unblock the Notifications