RCB కొంపముంచిన అంపైర్ తప్పిదం.. గుజరాత్ ఘన విజయం!
ఐపీఎల్ 2026 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కు గుజరాత్ టైటాన్స్ షాకిచ్చింది. గురువారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో ఆర్‌సీబీని ఓడించింది. ఈ గెలుపుతో ఈ సీజన్ ఆరంభంలో ఆర్‌సీబీ చేతిలో ఎదురైన పరాజయానికి గుజరాత్ టైటాన్స్ ప్రతీకారం తీర్చుకుంది.
ముందుగా బౌలింగ్‌లో సత్తా చాటిన గుజరాత్ టైటాన్స్.. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో విజయాన్ని అందుకుంది. అర్షద్ ఖాన్(3/22), జాసన్ హోల్డర్(2/29), రషీద్ ఖాన్(2/19) సత్తా చాటడంతో
ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. దేవదత్ పడిక్కల్(24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), విరాట్ కోహ్లీ(13 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 28) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. మహమ్మద్ సిరాజ్, కగిసో రబాడకు చెరో వికెట్ దక్కింది.

అనంతరం గుజరాత్ టైటాన్స్15.5 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. శుభ్‌మన్ గిల్(18 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43), జోస్ బట్లర్(19 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 39 నాటౌట్), రాహుల్ తెవాటియా(17 బంతుల్లో 4 ఫోర్లతో 27 నాటౌట్) సత్తా చాటారు. ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(3/28) మూడు వికెట్లు తీసినా.. రొమారియో షెపెర్డ్(2/30) రెండు వికెట్లు పడగొట్టినా ఫలితం లేకపోయింది. సుయాశ్ శర్మకు ఒక వికెట్ దక్కింది.
కొంపముంచిన అంపైర్ ఘోర తప్పిదం..
థర్డ్ అంపైర్ ఘోర తప్పిదం ఆర్‌సీబీ విజయవకాశాలను దెబ్బతీసింది. ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఔటైన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో రజత్ పాటిదార్ ఇచ్చిన క్యాచ్‌ను జాసన్ హోల్డర్ అద్భుతంగా అందుకున్నాడు. కానీ క్యాచ్ పూర్తి చేసే క్రమంలో బంతిని నేలకు తాకించాడు. అయినా థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. ఈ నిర్ణయంపై ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ అసహనం వ్యక్తం చేశారు. రజత్ పాటిదార్ సైతం అంపైర్ల తీరును తప్పుబడుతూ మైదానం వీడాడు.
థర్డ్ అంపైర్ తప్పిదం కారణంగా మూడో వికెట్‌కు నమోదైన 44 పరుగుల కీలక భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత ఆర్‌సీబీ వరుసగా వికెట్లు కోల్పోయి 155 పరుగులకే పరిమితమైంది. రజత్ పాటిదార్ ఇంకాసేపు క్రీజులో ఉండి ఉంటే ఆర్‌సీబీ 180 ప్లస్ రన్స్ చేసేది. అప్పుడు సునాయసంగా విజయాన్ని అందుకునేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
THE RAJAT PATIDAR'S CONTROVERSIAL CATCH AT AHMEDABAD.
— Tanuj (@ImTanujSingh) April 30, 2026
pic.twitter.com/P0dXblyFnn












Click it and Unblock the Notifications