ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి షిండే?
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవికిసీనియర్ కాంగ్రెస్ నాయకుడు సుశీల్ కుమార్ షిండేను ఉమ్మడి అభ్యర్థిగా పోటీకి దింపాలని ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయి. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) అభ్యర్థిగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి బైరాన్ సింగ్ షెకావత్ రంగంలోకి దిగారు. షెకావత్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
షిండే మొదటిసారి 1974లో కర్మలా నియోజక వర్గం నుంచి మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1974 నుంచి 1992 వరకు మహారాష్ట్ర మంత్రి వర్గాల్లో వివిధ శాఖలను నిర్వహించారు. ఆర్థిక మంత్రిగా తొమ్మిది సార్లుబడ్జెట్‌ను ప్రతిపాదించి ఆయన రికార్డు సృష్టించారు.












Click it and Unblock the Notifications
