టీడీపీ తొక్కేస్తోంది..! పవన్ కూ తెలుసు..! జనసేన ఎమ్మెల్యే షాకింగ్..!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు కావస్తోంది. మరో రెండున్నరేళ్లలో సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో స్ధానిక ఎన్నికలు వచ్చాయి. ఈ రెండున్నరేళ్లలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన ఇన్ ఛార్జ్ లు, టీడీపీ ఎమ్మెల్యేలు లేని చోట ఆ పార్టీ ఇన్ ఛార్జ్ ల చేతిలో జనసేన ఎమ్మెల్యేలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయాన్ని పలుమార్లు జనసేన ఎమ్మెల్యేలు, నేతలు పవన్ కళ్యాణ్ తో భేటీల్లో కూడా చెప్పారు. కానీ చర్యలు మాత్రం శూన్యం.
ఈ నేపథ్యంలో మరో జనసేన ఎమ్మెల్యే టీడీపీ నుంచి తమకు ఎదురవుతున్న ఒత్తిడిని బహిరంగంగానే అంగీకరించారు. తాడేపల్లి గూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ (Bolisetty Srinivas).. టీడీపీ నేతలు తమ క్యాడర్ ను తొక్కేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతల్ని తాము ఎంత గౌరవించినా, వారు మాత్రం జనసైనికుల్ని తొక్కేస్తున్నారని తెలిపారు. ఈ విషయం తమ నాయకుడు పవన్ కళ్యాణ్‌కు కూడా తెలుసన్నారు. దీనిపై సీఎం చంద్రబాబుతో కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో మన నాయకుడు మాట్లాడుతారంటూ కార్యకర్తలకు తెలిపారు.

ఇప్పటికే నియోజకవర్గంలో టీడీపీ నేతల ఒత్తిడి ఎదుర్కొంటుున్న బొలిశెట్టి శ్రీనివాస్.. ఈ మధ్య వరుసగా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. జనసేన వచ్చే ఎన్నికల్లో 60 సీట్ల వరకూ పోటీ చేస్తుందని ఈ మధ్యే ఆయన వెల్లడించారు. మరోవైపు స్ధానిక సంస్ధల ఎన్నికల్లో సీట్ల కోసం జనసేన నేతలు చేస్తున్న డిమాండ్లపై స్పందించిన బొలిశెట్టి.. ఇవాళ తాను చెప్తే మీకు సీట్ ఇవ్వరంటూ తేల్చేశారు. మీకు టికెట్లు ఇప్పించే అంత అర్హత నాకు లేదని వారికి చెప్పేశారు. తాను వాస్తవాన్నే చెప్తానని, ఎలాంటోడైనా నాకేం ఇబ్బంది లేదు, ఎవరికీ భయపడనని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications
