బీజేపీ, జనసేన సిగ్గుపడాలి - రూటు మార్చిన జగన్..!!

మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. డీఎస్సీ లో అక్రమాలు చోటు చేసుకున్నామని మరో సారి స్పష్టం చేసారు. నియామకంలో చోటు చేసుకున్న కొన్ని అంశాలను ప్రస్తావించారు. తన కుమారుడిని కాపాడుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. అర్హత లేని వారికి ఎవరు చెబితే పోస్టులు ఇచ్చారని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఈ వ్యవహారంలో స్పందించని బీజేపీ, జనసేన సిగ్గుపడాలని జగన్ వ్యాఖ్యానించారు.

డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని మాజీ సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మరి కొన్ని ఆధారాలను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు. డీఎస్సీ అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, అర్హత లేని వారికి ఎవరు చెబితే పోస్టులు ఇచ్చారని ప్రశ్నించారు. టెట్‌ అర్హత లేకుండా పోస్టులు ఇచ్చామని ప్రభుత్వం ఒప్పుకుందని, స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లు నిఖార్సయినవి కావని చెప్పలేకపోయారని తెలిపారు. జూడో పోటీల్లో దొంగ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు ఒప్పుకున్నారని, లంచాలు తీసుకుని స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. ఏడుసార్లు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేశామన్నది కూడా బోగస్‌ అని, అసలు ఏ పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇవ్వడమే పెద్ద స్కామ్‌ గా జగన్ అభివర్ణించారు. ఏపీపీఎస్సీలోనూ పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని చూశారని, దొడ్డిదారిన జీవో నెంబర్‌ 4 తీసుకురావాలని ప్రయత్నించారని తెలిపారు.

 మజ్జి శ్రీనుతో అనుబంధం గుర్తు చేసుకుంటూ.. బొత్సా కన్నీటి పర్యంతం..!!
మజ్జి శ్రీనుతో అనుబంధం గుర్తు చేసుకుంటూ.. బొత్సా కన్నీటి పర్యంతం..!!
ysrcp-chief-ys-jagan-made-key-comments-against-bjp-and-janasena-over-supporting-govt-in-dsc-irregul

బీజేపీ, జనసేన పై వ్యాఖ్యలు

వైసీపీ ప్రభుత్వ హయాంలో క్లియరెన్స్‌ పొందిన 814 పోస్టుల్లో పరీక్ష లేకుండా 40 పోస్టులు ఇవ్వాలని చూశారని, డీఎస్సీ స్కామ్‌ బయటకు రావడంతో ఆ ప్రయత్నం ఆగిపోయిందని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్‌ వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ కోరుతున్నామని, నిరుద్యోగ యువత తరఫున కోర్టులోనూ . .పోరాటం చేస్తున్నామని వెల్లడించారు. 'కాయలున్న చెట్టుకే రాళ్లదెబ్బలు తగులుతాయి' అంటూ డీఎస్సీ వ్యవహారంపై నారా లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలపైనా జగన్ స్పందించారు. లోకేశ్‌, ఆయన తండ్రి చంద్రబాబు చెప్పే సమాధానాలు కూడా అబద్ధాల రూపంలోనే ఉంటున్నాయని ఎద్దేవా చేశారు. డీఎస్సీ స్కామ్‌పై ఇంత రాద్ధాంతం జరుగుతున్నా బీజేపీ, జనసేన మౌనంగా ఉండటంపై స్పండించిన జగన్.. తాను అడిగే అంశం సరైందే అయినప్పుడు నోరు మెదపాల్సిన అవసరం అన్ని పార్టీలకూ ఉంటుందని అన్నారు. బీజేపీ, జనసేన ఎందుకు స్పందించడం లేదో వాళ్లనే అడగాలని మీడియాకు సూచించారు. ఇలాంటి చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నందుకు, ఇలాంటి వ్యవస్థను బలపరుస్తూ తప్పు చేస్తున్నందుకు బీజేపీ, జనసేన సిగ్గుపడాలని జగన్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+