అగార్కర్ సెంచరీ- భారత్ ఓటమి
లండన్: లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండుతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ 170 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లాండు ఉంచిన 568 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి రంగంలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్ చివరి రోజు సోమవారంనాడు 397 పరుగులకు అన్నివికెట్లను కోల్పోయింది.
ఈ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన ఇంగ్లాండు కెప్టెన్ నాజిర్ హుస్సేన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఇంగ్లాండు తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లను ముప్పు తిప్పలు పెడుతూ 155 పరుగులు చేశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లోవీరేంద్ర షెహవాగ్ మాత్రమే కాస్తా మెరుగ్గా ఆడి 84 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ రెండు ఇన్నింగ్స్‌లోనూఘోరం విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 16, రెండో ఇన్నింగ్స్‌లో 12 పరుగులు చేశాడు.












Click it and Unblock the Notifications
