న్యూఢిల్లీః బిజెపి జాతీయ అధ్యక్షునిగా వెంకయ్యనాయుడు ఎన్నికను పార్టీ జాతీయ కార్యవర్గ మండలి శనివారం నాడు లాంఛనంగా ధృవీకరించింది.
తల్కతోరా స్టేడియంలో జరుగుతున్న జాతీయ మండలి సమావేశాల్లో వెంకయ్యపేరును ఉపప్రధాని, పార్టీ సీనియర్ నేత అద్వానీ ప్రతిపాదించారు. ప్రధాని వాజ్‌పేయి ఇతరసీనియర్ నేతలు చేతులు ఎత్తడం ద్వారా తమ ఆమోదం ప్రకటించారు. వాజ్‌పేయి అద్వానీ ఇద్దరు కొత్త అధ్యక్షునికి శాలువాలు బహుకరించారు.