భద్రాది రాముడి నగలు ఇక ఓపెన్
ఖమ్మం: హిందూవులు ఎంతో పవిత్రంగా జరుపుకునే శ్రీరామనవమి పండుగ రేపే (శుక్రవారం). ఆంధ్రప్రదేశ్ లో శ్రీరాముడు అడుగిడిన ప్రదేశంగా భావించే భద్రాచలంలో ఏటా శ్రీరామనవమి నాడు లక్షలాది భక్తులతో కటకటలాడుతుంది. అయితే, ఈ సారి భద్రాచలం సందర్శించే భక్తలు సరికొత్త ఆనందాన్ని పొందగలరు. పర్యాటక రంగ అభివృద్దిలో భాగంగా 12 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలంలో పలు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టింది.
ఒక భారీ పార్క్ తో పాటు అడుగడుగునా దేవతావిగ్రహాలను ఏర్పాటు చేశారు. అన్నింటికన్నా ముఖ్యంగా శ్రీరాముడు జీవన చరిత్రను వివరించే ప్రత్యేక మ్యూజియంను ఏర్పాటు చేశారు. శ్రీరాముడు జననం నుంచి పట్టాభిషికం వరకు రాముడు జీవనఘట్టాలను వివరించే శిల్పాలను ఏర్పాటు చేశారు.
సీతమ్మకు చేయించాను సీతాకు పతకం అన్న పాట మాత్రం విని సంతృప్తి చెందుతోన్న తెలుగువారికి ఇక భద్రాది సీతరాముడు నగలు ఈ శ్రీరామనవమి నాటి నుంచి స్వయంగా తిలకించే అవకాశాన్ని దేవాలయ కమిటీ కల్పిస్తోంది. ఏడాది పొడుగునా మ్యూజియంలో దేవుడి నగలను ప్రదర్శిస్తారు.












Click it and Unblock the Notifications