Home
Posted on 05-11-03
హైదరాబాద్: రెండు మూడు రోజుల్లో ఎస్‌సి, ఎస్‌టి కమీషన్ చైర్మన్‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎస్‌సి, ఎస్‌టి కమీషన్‌కు సిటీ సివిల్ కోర్టుకు ఉండే అధికారాలుంటాయి. చైర్మన్‌తో పాటు ఐదుగురు సభ్యులతో కమీషన్‌ను ఏర్పాటు చేస్తారు. ఇందులో ఒక మహిళా సభ్యురాలు ఉంటారు. ఇదిలా వుంటే, ఎస్‌సి, ఎస్‌టి కమీషన్ చైర్మన్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహాజన సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది. పున్నయ్య కమిటీ సిఫార్సులను అమలు చేయకపోతే జిల్లాకు 200 చొప్పున తమ కార్యకర్తలు ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని సమితి నాయకులు చెప్పారు. పున్నయ్య కమిటీ సిఫార్సుల అమలులో జరుగుతున్న జాప్యానికి
నిరసనగా ఆందోళనకారులు ముఖ్యమంత్రి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.












Click it and Unblock the Notifications