వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Home

By Staff
|
Google Oneindia TeluguNews

Posted on 05-11-03

ఆందోళనతో లొంగిన లంచావతారం

విజయవాడ: ప్రజా ఉద్యమంతో లంచం తీసుకున్న సబ్‌ ట్రెజరీ ఉద్యోగిని అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు లొంగదీశారు. అతని చేత తప్పు ఒప్పించి లంచంగా తీసుకున్న మొత్తాన్ని బాధితురాలికి ఇప్పించారు.

సంఘటన వివరాలు ఇలా వున్నాయి- అనంతలక్ష్మి అనే మహిళ భర్త పోలీసు శాఖలో పని చేసేవాడు. అతని మరణాంతరం తనకు రావాల్సిన పెన్షన్‌ కోసం ఆమె సబ్‌ ట్రెజరీ కార్యాలయం చుట్టూ కాళ్లరిగిలే తిరిగింది. ఆమె పెన్షన్‌ కింద 95 వేల రూపాయలు రావాల్సి ఉంది. ఇందులో సగం తనకు ఇస్తే తప్ప పెన్షన్‌ చెల్లింపునకు చర్యలు తీసుకోబోననని సంబంధిత అధికారి రాయుడు మొండికేశాడు. ఎట్టకేలకు 30 వేల రూపాయలు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసి ఆమె చేతికి ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న ఎసిబి ఉన్నతాధికారి లోక్‌సత్తా, పియుసిఎల్‌లను సంప్రదించారు. ఈ రెండు సంస్థల కార్యకర్తలు సబ్‌ ట్రెజరీ కార్యాలయం వద్ద ప్రదర్శన నిర్వహించారు. అతని చేత తప్పు ఒప్పించారు. దీంతో ఆ అధికారి సస్పెండ్‌ అయ్యాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X