తిరుపతికి కొత్తగా రెండు రెగ్యులర్ రైళ్లు, రూట్.. షెడ్యూల్..!!

తిరుపతికి వెళ్లే రైల్వే ప్రయాణీకులకు బిగ్ అప్డేట్. రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి కి ఇప్పటి వరకు వీక్లీ రైళ్లుగా కొనసాగుతున్న రెండు రైళ్లను ఇక రెగ్యులర్ సర్వీసులుగా మార్పు చేస్తూ ప్రకటన చేసింది. వీటికి సంబంధించిన రూట్.. షెడ్యూల్ వెల్లడించింది. తిరుపతి-పండర్‌పూర్‌-తిరుపతి (వయా గుత్తి) ప్రత్యేక వీక్లీ రైలు (07012/32)ను రెగ్యులర్‌ రైలుగా మార్పు చేసారు. అదే విధంగా నాందేడ్​-తిరుచానూర్​ వీక్లీ స్పెషల్ రైలు సైతం ఇక రెగ్యులర్ ట్రైన్ గా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు రైల్వే అధికారులు స్పష్టత ఇచ్చారు.

తిరుపతి-పండర్‌పూర్‌ రెగ్యులర్‌ రైలు (17437)ను ఈ నెల 16 నుంచి, దీని తిరుగు ప్రయాణపు రైలు (17438)ను ఈ నెల 17వ తేదీ నుంచి రెగ్యులర్‌ వీక్లీగా మారుస్తున్నట్లు తెలిపారు. ఈ రైలు తిరుపతి, రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, డోన్‌, గద్వాల, వనపర్తి రోడ్‌, మహబూబ్‌నగరర్‌, షాద్‌నగర్‌, కాచిగూడ, సికింద్రాబాద్‌, బేగంపేట, లింగంపల్లి, వికారా ద్‌, జహీరాబాద్‌, బీదర్‌, ఉదయగిరి, లాతూర్‌ రోడ్డు, ధారాశివ్‌, బర్సి టౌన్‌, కురుద్వాడి, మోబింద్‌ స్టేషన్ల మీదుగా పండర్‌పూర్‌కు చేరుకుంటుందన్నారు. అదే విధంగా ప్రస్తుత నాందేడ్​-తిరుచా ర్​ వీక్లీ స్పెషల్​ ఎక్స్ ప్రెస్ నెల 9వ తేదీ నుంచి రెగ్యులర్​ రైలుగా మారనుంది. తో పాటు నాందేడ్​-ధర్మవరం స్పెషల్​ ట్రైన్​ క్రమబద్ధీకరణ ఉత్తర్వులు కూడా త్వరలో వెలువడనున్నాయి.

తిరుమల కిటకిట, దర్శనాల్లో కీలక మార్పులు- ఆ టోకెన్లు, వారి లేఖలు నిలిపివేత..!!
తిరుమల కిటకిట, దర్శనాల్లో కీలక మార్పులు- ఆ టోకెన్లు, వారి లేఖలు నిలిపివేత..!!
railways-decided-to-run-weekly-trains-as-regular-trains-for-tirupati-from-nanded-details-here

తిరుపతికి వెళ్లే రైలు రూట్.. షెడ్యూల్

ఇప్పటికే కరీంనగర్​-తిరుపతి బై వీక్లీ ఎక్స్​ప్రెస్​ అందుబాటులో ఉండగా, తాజాగా మరో రెగ్యులర్​ రైలు కూడా అందుబాటులోకి వచ్చింది. పెద్దపల్లి, రామగుండం నుంచి తిరుపతి వెళ్లేందుకు కూడా పలు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కరీంనగర్ జిల్లా నుంచి తిరుపతి వెళ్లాలంటే సమస్యలు ఉండేవి. ఇప్పుడు రామగుండం నుంచి పలు రైళ్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. నాందేడ్​-తిరుచానూర్​ (17633) ఎక్స్​ప్రెస్​ ప్రతి శనివారం సాయంత్రం 4.45 గంటలకు నాందేడ్ లో బయలుదేరుతుంది. కోరుట్లలో రాత్రి 6.58 గంటలకు, జగిత్యాలకు రాత్రి 8.23, కరీంనగర్​కు 9.28 గంటలకు చేరుతుంది. ఒక్కో స్టేషన్​లో రెండు నిమిషాల పాటు ఆ రైలుకు హాల్టింగ్​ కల్పించారు. మరుసటి రోజు ఆదివారం మధ్యాహ్నం 12.20 గంటలకు తిరుచానూర్​ చేరుకుంటుంది. మళ్లీ తిరుగు ప్రయాణంలో ఆదివారం రాత్రి 7.45 గంటలకు స్టార్ట్​ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+