నిహారిక కొణిదెల - సుడిగాలి సుధీర్ కాంబోలో మూవీ..
మెగా డాటర్ "నిహారిక కొణిదెల" గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగబాబు కుమార్తెగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ.. ముందుగా షార్ట్ ఫిల్మ్స్‌తో తన టాలెంట్‌ను నిరూపించింది. "ముద్దపప్పు అవకాయ" సహా పలు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుంది. ఆ తర్వాత బుల్లితెరపై సైతం యాంకర్ గా సత్తా చాటింది. ఈ గుర్తింపుతోనే నాగశౌర్యతో కలిసి "ఒక మనసు" చిత్రంలో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించకపోయినా.. విమర్శకుల ప్రశంసలు పొందగలిగింది. ఆ తర్వాత తమిళంతో పాటు తెలుగు చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.
హీరోయిన్ గా ఆశించినంత ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోవడంతో.. నిర్మాతగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. "పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్" అనే నిర్మాణ సంస్థను స్థాపించి.. వెబ్ సిరీస్‌లు, చిత్రాలను నిర్మించడం ప్రారంభించింది. "డెడ్ లైన్", "కమిటీ కుర్రోళ్లు" వంటి విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించి, కంటెంట్‌కి ప్రాధాన్యతనిచ్చే నిర్మాతగా నిలిచింది. రీసెంట్ గానే "రాకాసా" సినిమాతో మరో హిట్ అందుకుంది. ఈ చిత్రంలో సంగీత్ శోభన్ హీరోగా నటించగా.. మానస శర్మ దర్శకత్వం వహించారు. కాగా ఇప్పుడు లేటెస్ట్ గా సుధీర్ - నిహారిక కాంబోలో మూవీ రాబోతుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది.

కాగా బుల్లితెరపై నటుడు సుడిగాలి సుధీర్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. 'జబర్దస్త్' కామెడీ షోలో కమెడియన్‌గా ప్రారంభించి.. ఆ తర్వాత యాంకర్‌గా మారి రష్మి, ప్రదీప్‌లతో కలిసి పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరించారు. బుల్లితెరపై సూపర్ సక్సెస్ సాధించిన సుధీర్, వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. హీరోగా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన నటించిన 'గాలోడు' చిత్రం కమర్షియల్‌గా మంచి వసూళ్లను సాధించింది. అయితే ఆ తర్వాత వచ్చిన 'ఆపరేషన్ సహస్ర' ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. ప్రస్తుతం సుధీర్ 'హైలెస్సో' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు.
అయితే జబర్దస్త్ నాటి నుంచే సుధీర్, నాగబాబు కూతురు నిహారికతో మంచి అనుబంధం కలిగి ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ షోలో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందని నిహారిక స్వయంగా వెల్లడించారు. రూ.25 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తానని ఆమె ప్రకటించారు. అప్పుడు అదంతా వినోదం కోసమే చేసినా.. ఇప్పుడు మాత్రం నిహారిక నిజంగానే సుధీర్ హీరోగా సినిమా చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. మానస శర్మ దర్శకత్వంలో సుధీర్ హీరోగా ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications