ఎన్టీఆర్, ఎంజీఆర్‌, పవన్ కళ్యాణ్‌లతో పోల్చలేం? ఆయన రూటే సెపరేటు!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అందరి నోటా వినిపిస్తున్న ఒకే ఒక ప్రశ్న.. దళపతి విజయ్ చరిత్రను తిరగరాస్తారా?. 'తమిళగ వెట్రి కళగం'(టీవీకే) పార్టీ స్థాపించిన విజయ్.. తన రాజకీయ అరంగేట్రంతోనే అద్భుతాలు సృష్టిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దాదాపు ప్రతి ఎగ్జిట్ పోల్ విజయ్‌కు రెండంకెల ఓట్ల శాతాన్ని అంచనా వేస్తుండగా.. యాక్సిస్-మై ఇండియా వంటి సర్వేలు ఏకంగా 98 నుంచి 120 స్థానాలు వచ్చే అవకాశం ఉందని, అంటే సాధారణ మెజారిటీకి చేరువలో ఉన్నారని పేర్కొనడం సంచలనంగా మారింది.

గత తరం స్టార్లతో పోలిక అనవసరం
సాధారణంగా ఎవరైనా స్టార్ హీరో రాజకీయాల్లోకి వస్తే వెంటనే ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత వంటి వారితో పోలుస్తారు. కానీ విజయ్ ప్రస్థానం పూర్తిగా భిన్నమైనది. 1983లో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారం సాధించారు. అయితే అప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకత, తెలుగు ఆత్మగౌరవం, కుల సమీకరణాలు ఎన్టీఆర్‌కు అనుకూలంగా ఉన్నాయి. కానీ విజయ్ ఇప్పుడు ఒక జాతీయ పార్టీతో కాకుండా, దశాబ్దాలుగా పాతుకుపోయిన రెండు బలమైన ప్రాంతీయ పార్టీలతో (డీఎంకే, ఏఐఏడీఎంకే) తలపడుతున్నారు. ఆయనకు ప్రత్యేకమైన కుల ఓటు బ్యాంక్ లేదు, కేవలం 'జెన్ జెడ్' యువత, తనకున్న విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌నే నమ్ముకుని బరిలోకి దిగారు.

Vijay Political Debut Why Thalapathy Cannot Be Compared to NTR MGR or Pawan Kalyan

రాజకీయ అనుభవం లేని సాహసం
ఎంజీఆర్ తన సొంత పార్టీ పెట్టకముందు డీఎంకేలో చాలా కాలం పనిచేశారు. కోశాధికారిగా బాధ్యతలు నిర్వహించారు. జయలలిత కూడా ఎంజీఆర్ నీడలో రాజకీయం నేర్చుకుని.. పార్టీలో చీలిక తర్వాత పగ్గాలు చేపట్టారు. విజయ్ కాంత్‌కు కూడా నడిగర్ సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయనకు సామాజిక వర్గ మద్దతుతో పాటు గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ద్వారా వచ్చిన అనుభవం ఉంది. కానీ విజయ్ ఎలాంటి రాజకీయ నేపథ్యం, సంస్థాగత అనుభవం లేదా భావజాల ప్రదర్శన లేకుండా నేరుగా వెండితెర నుంచి వచ్చి ప్రజల ముందుకు వెళ్తున్నారు. ఇది కేవలం స్టార్‌డమ్ ఆధారంగా సాగుతున్న "ఇన్‌స్టంట్ సక్సెస్ స్టోరీ" అని చెప్పవచ్చు.

జెన్ జెడ్ మార్పుకు విజయ్ కేరాఫ్ అడ్రస్
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, మీమ్స్, సోషల్ మీడియా ప్రభావం ఉన్న నేటి కాలంలో విజయ్ ఓ మార్పుకు సంకేతంగా నిలిచారు. పాతకాలపు రాజకీయాలకు స్వస్తి పలకాలని కోరుకునే యువతకు విజయ్ ఓ ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. ఒకవేళ విజయ్ ఈ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ ఓట్ల శాతం సాధిస్తే.. అది కేవలం ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్‌కే కాదు, తమిళనాడులో మార్పు కోసం తపిస్తున్న ప్రజల ఆకాంక్షకు నిదర్శనంగా నిలుస్తుంది. రజనీకాంత్ వంటి వారు రాజకీయాల్లోకి రావడానికి మీమాంస పడిన తరుణంలో, విజయ్ తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉంటూ రాజకీయాల్లోకి రావడం ఒక సాహసోపేతమైన నిర్ణయం. అందుకే ఆయనను ఎవరితోనూ పోల్చలేం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+