లింగ్డోతో విభేదించిన వెంకయ్యనాయుడు

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 16-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల కమీషనర్‌ లింగ్డో వ్యక్తం చేసిన అభిప్రాయంతో భారతీయ జనతా పార్టీ విభేదించింది. వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత లింగ్డో ఎన్నికల నిర్వహణ గురించి మాట్లాడాల్సి ఉండిందని బిజెపి జాతీయాధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడు అన్నారు.

హైదరాబాద్‌లోని మలక్‌పేట నియోజకవర్గంలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన ఆదివారం ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలను మూడు నెలల్లో నిర్వహించడం సాధ్యమేనని ఆయన అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరపాలనేవిషయంపై నిర్ణయం తీసుకునే అధికారం ఎన్నికల కమీషన్‌కు ఉన్నదని, అయితే ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా నిర్వహించడం అవసరమని ఆయన అన్నారు. రాజ్యాంగస్ఫూర్తి, ప్రజాస్వామి స్ఫూర్తి కోసం సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరపాలని ఆయన అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X