మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు

హైదరాబాద్‌:దీపం పథకం కింద రాష్ట్రంలోని పేదమహిళలకు గ్యాస్‌ సిలిండర్లుఅందిస్తామని తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు.రంగారెడ్డి జిల్లా తాండూరు ఎన్నికలసభలో ఆయన ఆదివారంప్రసంగించారు.

దీపం పథకం కింద పేదమహిళలకు ఇప్పటి వరకుఇరవై అయిదు లక్షల గ్యాస్‌ సిలిండర్లుఇచ్చామని, మహిళల ఆరోగ్యంబాగుండాలనే ఉద్దేశంతో వీటినిఇస్తున్నామని ఆయన చెప్పారు. గ్యాస్‌ధరల తగ్గింపునకు చర్యలుతీసుకున్నామని, పన్ను తగ్గించేందుకుకృషి చేశామని, దీని వల్ల గ్యాస్‌ ధరతగ్గిందని ఆయన చెప్పారు.స్వాతంత్య్రంవచ్చిన తర్వాత మహిళఅభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలుచేపట్టింది దేశంలో ఒకతెలుగుదేశం పార్టీయేనని, ఏ పార్టీ కూడామహిళల కోసం కార్యక్రమాలుచేపట్టలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్‌కల్లబొల్లి కబుర్లు చెబుతోందని ఆయనవిమర్శించారు. మైనారిటీ సోదరులకోసం స్వయం సహాయక గ్రూప్‌లనుఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.ప్రజల్లోచైతన్యం వస్తే తమకు నష్టంజరుగుతుందని కాంగ్రెస్‌ నాయకులుభయపడుతున్నారని చంద్రబాబుఆదివారం ఉదయం హైదరాబాద్‌లోవిలేకరుల సమావేశంలోవిమర్శించారు. కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌పార్టీ (సియల్‌పి) మాజీ నేత డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి, మాజీముఖ్యమంత్రి నేదురుమల్లిజనార్దన్‌ రెడ్డి ఈ కోవలోకే వస్తారనిఆయన అన్నారు. దౌర్జన్యంతో, డబ్బులతోవై.యస్‌. కుటుంబీకులు పులివెందులఅసెంబ్లీ స్థానం నుంచి, కడపపార్లమెంటు నియోజకవర్గం నుంచిగెలుస్తున్నారని ఆయనఆరోపించారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+