వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్‌మునిమనవలపై న్యూయార్క్‌ కోర్టు తీర్పు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌:దివంగత మాజీముఖ్యమంత్రి ఎన్‌టి.రామారావు మునిమనవలను తండ్రి,నానమ్మల సంరక్షణలోనే ఉంచాలని న్యూయార్క్‌ ఫ్యామిలీ కోర్టు తీర్పుచెప్పింది. వీరు అమెరికా పౌరులు కాబట్టి ఈ వ్యవహారం భారతదేశన్యాయస్థానాల పరిధిలోకి రాదని కోర్టుస్పష్టంచేసింది. నాలుగేళ్ళ క్రితం ఎన్టీఆర్‌ మనవరాలు కుముదినిఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచీ ఆమె పిల్లలు జయవిజయ ప్రసాద్‌ ,నీలకృష్ణ ప్రసాద్‌ ఇక్కడే తమ తండ్రి శ్రీనాథ్‌ప్రసాద్‌ రాజావాసిరెడ్డితో ఉంటున్నారు.

కుముదినిఆత్మహత్య తర్వాత పిల్లలను తమకు అప్పగించవలసిందిగా ఆమెతల్లిదండ్రులు నందమూరి జయకృష్ణ, పద్మజ హైదరాబాద్‌లోకోర్టును ఆశ్రయించారు. తర్వాత ఈకేసు హైకోర్టుకు వెళ్ళింది.ఇద్దరు పిల్లలు మైనర్‌ కావడంతో వారు ఎవరితో ఉండడానికిఇష్టపడుతున్నారో తెలుసుకునేందుకు న్యాయస్థానం ముందుహాజరుపరచాలని ఆంధ్రపదేశ్‌ హైకోర్టు ఇటీవల ఆదేశించింది. అయితే,ఇద్దరు పిల్లలూ న్యూయార్క్‌లోనే పుట్టినందున జన్మతః వారు అమెరికాపౌరులని న్యూయార్క్‌ ఫ్యామిలీ కోర్టు స్పష్టంచేసింది. వీరి వ్యవహారంభారతదేశ కోర్టుల పరిధిలోకి రాదని తెలియజేసింది. పిల్లలిద్దరినీతండ్రి, నానమ్మ గృహలక్ష్మి రాజావాసిరెడ్డిల సంరక్షణలోనే ఉంచాలనితీర్పుచెప్పింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X