వెంకయ్యనాయుడుకారుఢీ: ఒకరికి గాయాలు

న్యూఢిల్లీ: భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడువెంకయ్య నాయుడు ప్రయాణిస్తున్న కారుకింద పడి ఒకరుగాయపడ్డారు. గత సోమవారం జరిగిన ఈ సంఘటనలో యాభై ఏళ్ళదయానంద్‌ తీవ్రంగా గాయపడినట్లు పోలీసువర్గాలు తెలిపాయి.దయానంద్‌ను రాంమనోహర్‌ లోహియా ఆసుపత్రిలో చేర్పించి రెండురోజులచికిత్స అనంతరం ఇంటికి పంపించారు.

సోమవారం రాత్రిఎనిమిదిన్నరకు ఈ ప్రమాదంజరిగినప్పటికీ గురువారం దాకా బయటికిరాలేదు.నిర్లక్ష్యంగా కారు నడిపాడనే అభియోగంతో డ్రైవర్‌ కుల్దీప్‌నుఅరెస్టుచేసి రెండు రోజుల తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు.ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న దయానంద్‌ రాష్ట్రపతిభవన్‌ సమీపంలోనిమదర్‌థెరిసా క్రీసెంట్‌ వద్ద రోడ్డు దాటుతుండగా ప్రమాదంజరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలోవెంకయ్యనాయుడు ఆ కారులో ఉన్నదీ లేనిదీ తెలియడం లేదు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+