ఆల్‌మట్టినీళ్ళు వదలడం లేదు: కర్నాటక సిఎం
బెంగుళూరు: ఆల్‌మట్టిడ్యామ్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి నీళ్ళు విడుదల చేయడం లేదనికర్నాటక ముఖ్యమంత్రి ఎన్.ధరమ్‌సింగ్ శనివారం నాడుస్పష్టం చేశారు. ఆల్‌మట్టి డ్యామ్ నుంచి కృష్ణా నీరు విడుదలచేయడానికి కర్నాటక అంగీకరించిందని కేంద్రం చెప్పి ఒక రోజుగడవక ముందే ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. నీటి విడుదలకోసం ఆంధ్రప్రదేశ్ చేసిన విజ్ఞప్తి గురించి ప్రధానమంత్రిమన్మోహన్‌సింగ్, జలవనరుల శాఖమంత్రి ప్రియరంజన్‌దాస్‌మున్షి తనతో ఫోనులో మాట్లాడారని శనివారం నాడిక్కడఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు.












Click it and Unblock the Notifications