న్యూఢిల్లీ: పార్ల్లమెంటులో గందరగోళంచెలరేగడం, సభ్యులు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంసర్వసాధారణమైన నేపథ్యంలో కొత్తగా ఎంపికైన రాజ్యసభసభ్యులు సభలో ఎలా ప్రవర్తించాలి అన్న విషయంపై పాఠాలునేర్చుకుంటున్నారు.
సభలో చేయవలసినవి, చేయకూడనివిఏమిటి, వారి ప్రవర్తన ఎలా ఉండాలి అన్నవిషయంపై రెండు రోజుల పాటు నిర్వహించే ఓరియేంటేషన్ కార్యక్రమంశనివారం ఇక్కడ ప్రారంభమైంది. పార్లమెంటులో ప్రవర్తనా నియమావళి,భారత రాజకీయాల్లో రాజ్యసభ పోషిస్తున్న పాత్ర, అందిస్తున్నసేవలు, సభ నాయకుని పాత్ర, ప్రతిపక్ష నాయకుని పాత్ర, ప్రజాప్రాధాన్యం ఉన్న ఏ ఏ అంశాల్ని ప్రస్తావించాలి, పార్లమెంటరీ హక్కులు తదితరఅంశాలపై సభ్యులకు అవగాహన కల్పిస్తారు.