క్రికెట్‌:భారత్‌ ఆశలు సజీవం

చెన్నై:ఆస్ట్రేలియా భారత్‌ ముందు 229పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆస్ట్రేలియాతన రెండో ఇన్నింగ్స్‌లో 369పరుగులు చేసింది. మరోసారి భారతస్పిన్నర్లు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌కుబ్రేకులు వేశారు. మొదటి ఇన్నింగ్స్‌లోఏడు ఆస్ట్రేలియా వికెట్లు తీసుకున్న అనిల్‌కుంబ్లే రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లుతీసుకొని భారత్‌ ఆశలను సజీవంగాఉంచారు. మరో స్పిన్నర్‌ హర్బజన్‌సింగ్‌ మూడు వికెట్లు తీసుకున్నాడు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌మూడు ఓవర్లలో భారత్‌ పందొమ్మిదిపరుగులు చేసింది. సెహ్వాగ్‌ పన్నెండుపరుగులతోనూ, యువరాజ్‌ సింగ్‌ ఏడుపరుగులతోనూ క్రీజ్‌లో ఉన్నారు.

మార్టిన్‌బ్యాటింగ్‌ చేస్తున్నంత సేపు భారత్‌ఆశలను వమ్ము చేసే పరిస్థితి ఏర్పడింది.నాలుగు వికెట్లు కోల్పోయి 150 పరుగులఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఆస్ట్రేలియా ఆదివారంబ్యాటింగ్‌కు దిగింది. శనివారం పందొమ్మిదిపరుగులతో, సున్నా పరుగులతో క్రీజ్‌లోఉన్న మార్టిన్‌, జిలెస్పీ ఆదివారం ధాటిగాఆడారు. దీంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్‌ దిశగాసాగిపోయే పరిస్థితి కనిపించింది. చెలరేగినఆడుతున్న మార్టిన్‌కు జిలెస్పీ మంచిమద్దతు ఇచ్చాడు. మార్టిన్‌ సెంచరీసాధించాడు. అతను నూటా నాలుగుపరుగులు చేశాడు. క్లార్క్‌ ముప్పైతొమ్మిది పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు.గిల్‌క్రిస్ట్‌ నలబై తొమ్మిది పరుగులు చేసిశనివారం ఆట ముగిసే సమయంలోఅవుటయ్యాడు. దాంతో జిలెస్పీ నైట్‌వాచ్‌మన్‌గా బ్యాటింగ్‌కు దిగి తనబాధ్యతను సమర్థంగానిర్వహించాడు.తొలిటెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో ఈటెస్టులో విజయం సాధిస్తే భారత్‌ టెస్టులజయాపజయాలను సమంచేయగలుగుతుంది. ఈ టెస్టులోగెలవడానికి భారత్‌కు మంచిఅవకాశం ఉంది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+