నక్సల్స్‌సిఫార్సులు మాకక్కర్లేదు: డిజిపి
నల్లగొండ:తమకు నక్సల్స్ సిఫార్సులుఅక్కరలేదని రాష్ట్ర పోలీసు డైరెక్టర్‌జనరల్ (డిజిపి) ఎస్. ఆర్. సుకుమారఅన్నారు. నక్సల్స్ తమ అంతర్గతవ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దనిఆయన అన్నారు. పోలీసుల జీతాలు పెంచాలనినక్సలైట్లు ప్రభుత్వాన్ని డిమాండ్‌చేయడంపై ఆయన ఆదివారం విలేకరులసమావేశంలో తీవ్రంగాప్రతిస్పందించారు.
చర్చలవెసులుబాటు వల్ల నక్సల్స్‌బలోపేతమయ్యారని, నియామకాలుపెంచుకున్నారని ఆయన అన్నారు. అయితేపోలీసులు ఆత్మస్థయిర్యం కోల్పోయారని,నిస్పృహకు గురయ్యారని అనడంలో ఏమాత్రం నిజం లేదని ఆయన అన్నారు.ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపినాయకులను ఏ విధంగా చేశారోతెలుసునని, అయినా చర్చలుజరుగుతున్నప్పుడు తాను ఈ విషయాలుమాట్లాడకూడదని ఆయన అన్నారు.సిపిఐ (మావోయిస్టు) నాయకులు ముప్పాళ్లలక్ష్మణరావుకు, రామకృష్ణకు ఎన్నిడబ్బులు వచ్చాయో తమకు తెలుసునని,చందాలు వసూలు చేస్తున్నారని, వారిలోఅగ్రకులం ఎట్లా ఆధిపత్యంచెలాయిస్తున్నదో తానుచెప్పదలుచుకోలేదని ఆయన అన్నారు.ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ జిల్లాలోనక్సలైట్లు బలంగా వుండేవారని,పదిహేనేళ్లుగా ఉత్తర తెలంగాణలోనక్సలైట్లు బలహీనపడుతూ వచ్చారని,ఈ విషయాన్ని తమ డాక్యుమెంట్లలోనే వారురాసుకున్నారని, ఉత్తర తెలంగాణలోపట్టుకోల్పోయామని రాసుకున్నారని, అదిగుండె కాయ వంటిదని, తిరిగి దాన్నిఆధీనంలోకి తెచ్చుకోవాలని రాసుకున్నారనిఆయన వివరించారు.











Click it and Unblock the Notifications