నక్సల్స్‌నేతలతో సాగుతున్న చర్చలు
హైదరాబాద్:ప్రభుత్వ ప్రతినిధులకు, నక్సలైట్‌నేతలకు మధ్య ఆదివారంనాడు కూడాచర్చలు కొనసాగాయి. భూపంపిణీపై ఈచర్చలు జరుగుతున్నట్లు సమాచారం.భూస్వాముల నుంచి నష్టపరిహారంచెల్లించకుండా భూములను స్వాధీనంచేసుకొని పేదలకు పంచాలని సిపి ఐ(మావోయిస్టు), సిపి ఐ (యంయల్)జనశక్తి డిమాండ్‌చేస్తున్నాయి.
ఇదిలావుంటే, కాల్పుల విరమణ పర్యవేక్షకకమిటీ సభ్యులు ఆదివారం ప్రభుత్వప్రతినిధులను, నక్సలైట్ నేతలను,నక్సలైట్ ప్రతినిధులనుకలుసుకున్నారు. తమకు పిలుపురావడంతో ఇక్కడికి వచ్చామని కమిటీసభ్యుడు ఘంటా చక్రపాణివిలేకరులతో చెప్పారు. కాల్పుల విరమణపాటించే విషయంలో ఇరు పక్షాల మధ్యసమస్యలు తలెత్తినప్పుడు తాముజోక్యం చేసుకుంటామని ఆయన చెప్పారు.తాము నక్సలైట్ ప్రతినిధులతోమాట్లాడామని ఆయన చెప్పారు. విడిగానక్సలైట్ నేతలతో తాముసమావేశమైనట్లు ఆయనతెలిపారు.











Click it and Unblock the Notifications