సమస్యలుచెప్పడానికే నక్సల్స్ వచ్చారు: వైయస్
విశాఖపట్నం/విజయనగరం: నక్సలైట్ నేతలుతమ సమస్యలను వినిపించడానికేవచ్చారని ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆసమస్యలను తమ ప్రతినిధులువింటారని, వారి సమస్యలను పరిశీలించిరాజ్యాంగ పరిధిలో పరిష్కరించడానికివీలైనపాటిని మంత్రి వర్గ ఆమోదంతోపరిష్కరిస్తామని ఆయన అన్నారు.విజయనగరంలో పల్లెబాటకుబయలుదేరుతూ ఆయన ఆదివారంకొద్దిసేపు విశాఖపట్నం విమానాశ్రయంలోవిలేకరులతో మాట్లాడారు.
తుపాకులువీడి జనజీవన ప్రవంతిలోకి వస్తేనేనక్సలైట్ల సమస్యలు పరిష్కరించడానికివీలవుతుందని, వారితో చర్చలు కూడాఅప్పుడే ఫలప్రదమవుతాయని ఆయనఅన్నారు. పార్వతీపురం విలేకరులసమావేశంలో ఆయన ఇదే విషయాన్నిపదే పదే చెప్పారు. తుపాకులు వీడినక్సలైట్లు గాంధేయ మార్గంలోకిరావాలని ఆయన నక్సలైట్లకుపిలుపునిచ్చారు.నక్సలైట్లుతమ సమస్యలు వినిపిస్తారని, వాటినిపరిష్కరించాలా, వద్దా అనేది తామునిర్ణయించుకుంటామని ఆయన చెప్పారు.ప్రపంచ బ్యాంకు నిధులు తీసుకోకుండాఉండటం సాధ్యం కాదని ఆయన స్పష్టంచేశారు. ప్రపంచ బ్యాంకు షరతులకుతాము తలొగ్గబోమని, అయితే అప్పులుమాత్రం తీసుకుంటామని, అక్కడి నుంచితీసుకోకపోతే ఇచ్చేవారెవరని ఆయన అంటూ"మీరు ఇస్తారా? అని ఆయననక్సలైట్లను ఉద్దేశించి అన్నారు. అలిపిరిసంఘటనకు సంబంధించిన కేసులనుఉపసంహరించాలని నక్సలైట్ నేతలుకోరుతున్నారని, ఈ విషయాన్ని పరిశీలించితగిన నిర్ణయం తీసుకుంటామని ఆయనచెప్పారు.ఆసిఫ్‌నగర్‌లోతమ అభ్యర్థి ఓటమి కాంగ్రెస్ ఓటమి కాదనిఆయన అన్నారు. ఈ ఎన్నికలో తెలుగుదేశంపార్టీకే ఎక్కువ నష్టం జరిగిందని ఆయనఅన్నారు. గతంలో వచ్చిన ఓట్ల కన్నాతెలుగుదేశం పార్టీకి పందొమ్మిది వేల ఓట్లుతక్కువగా వచ్చాయని, తమకు ఎనిమిదివేల ఓట్లు ఎక్కువ వచ్చాయని ఆయనచెప్పారు. నైతిక విలువలకు కట్టుబడేదానం నాగేందర్ రాజీనామా చేసితమ పార్టీలోకి వచ్చారని ఆయనఅన్నారు.విజయనగరంజిల్లా గిరిజన గ్రామాల్లో ఆయన ఆదివారంరాజీవ్ పల్లెబాట కార్యక్రమాన్నినిర్వహించారు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి రాని గ్రామాలకు ఆయన వచ్చారు.దీంతో గిరిజనులు ఆయనతో కరచాలనంచేయడానికి పెద్ద యెత్తునముందుకు వచ్చారు. అధికారులునెలకోసారి గిరిజన గ్రామాలను సందర్శించాలనిఆయన ఆదేశించారు.











Click it and Unblock the Notifications