గోవిందాగోశాలకుఅధికారుల ముప్పు
ముంబాయి:ప్రముఖ హిందీనటుడు, లోక్‌సభ సభ్యుడుగోవిందా తన ఇంటి ఆవరణలో అనుమతిలేకుండా కట్టినగోశాలను కూలగొట్టాలని ముంబాయి మున్సిపల్‌అధికారులు నిర్ణయించారు.మలద్‌లోని మద్ ఐలాండ్‌లో గోవిందాకుసువిశాలమైన బంగళా ఉంది. దాని ఆవరణలోఆయన పదిహేను వందల చదరపుఅడుగుల చావిడి నిర్మించి అందులో పాతిక ఆవులను పెంచుతున్నాడు.
గోవిందాకట్టిన మొత్తం బంగళాయేఅక్రమమని, అది కోస్టల్ రెగ్యులేషన్‌జోన్‌లోకి వస్తుందని గతంలో వార్తలువచ్చాయి. చివరికి మున్సిపల్ అధికారులుదానికి క్లీన్‌చిట్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగాగోవిందా గోశాల వార్తల్లోకి వచ్చింది.ఆయన గోశాలకు అనుమతి తీసుకున్నారోలేదోనని పరిశీలిస్తున్నాం. అనుమతి లేదనితేలితే కూలగొడతాం అని ఒక మున్సిపల్‌అధికారి చెప్పారు.












Click it and Unblock the Notifications