పులిచింతలపైకోర్టు తీర్పు హర్షణీయం: టిడియఫ్
హైదరాబాద్:పులిచింతల నిర్మాణం పనులను ఆపేస్తూహైకోర్టు ఇచ్చిన తీర్పును అమెరికాలోనితెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్(టిడియఫ్) ఆహ్వానించింది. తెలంగాణప్రాంతంలోని పలు విలువైన ప్రాజెక్టులుపెండింగ్‌లో ఉండగా పులిచింతలప్రాజెక్టును చేపట్టడం రాజకీయప్రచారహోరు వల్లనేనని ఫోరమ్ ఒకప్రకటనలో అభిప్రాయపడింది.
కోర్టుతీర్పును ప్రభుత్వం ఆంధ్ర ప్రాంతసంకుచిత రాజకీయాలకు కొట్టుకొని పోకుండా,డెల్టా ప్రాంత రాజకీయ నాయకులప్రభావంలో పడకుండా సరైన స్ఫూర్తితోస్వీకరించాలని టిడియఫ్ అభిప్రాయపడింది.ప్రత్యేక ఇష్టాలు ఆమోదాలు, తగిన విధానాలులేకుండా కొససాగవని తీర్పుతెలియజేస్తున్నదని అన్నది. ఆనకట్టనిర్మాణం వల్ల సామాన్య ప్రజలకు,ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు జరిగే తీవ్రనష్టాల గురించి వారికి పట్టింపు లేదనివిమర్శించింది.అన్నిఆమోదాలున్న తెలంగాణ ప్రాజెక్టులను,ఆమోదం అవసరం లేని చిన్న నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టాలనిముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డిని, భారీ నీటి పారుదల శాఖమంత్రి పొన్నాల లక్ష్మయ్యను కోరడానికితెలంగాణలోని రాజకీయ నాయకులుపార్టీలకు అతీతంగా ఏకం కావాలనిటిడియఫ్ కోరింది. సంకుచిత డెల్టారాజకీయ ప్రయోజనాల కోసం కీలుబొమ్మగాఉపయోగ పడవద్దని టిడియఫ్‌లక్ష్మయ్యను కోరింది. పులిచింతలప్రాజెక్టుపై తెలంగాణ ప్రజల తరఫుననిలబడి పోరాడిన న్యాయవాది వి.వెంకటరెడ్డిని టిడియఫ్‌కు చెందినమధు కె. రెడ్డిఅభినందించారు.











Click it and Unblock the Notifications